Asianet News TeluguAsianet News Telugu

విరూపాక్ష పబ్లిక్ టాక్ : క్లైమాక్స్ సినిమాకి మైనస్... యావరేజ్ సినిమా..!

మెగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ `చిత్రలహరి`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `ప్రతి రోజు పండగే` వంటి డీసెంట్‌ హ్యాట్రిక్‌ హిట్ల తర్వాత `రిపబ్లిక్‌` చిత్రంతో బోల్తా కొట్టాడు. 

First Published Apr 21, 2023, 12:19 PM IST | Last Updated Apr 21, 2023, 12:19 PM IST

మెగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ `చిత్రలహరి`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `ప్రతి రోజు పండగే` వంటి డీసెంట్‌ హ్యాట్రిక్‌ హిట్ల తర్వాత `రిపబ్లిక్‌` చిత్రంతో బోల్తా కొట్టాడు. అంతేకాదు రియల్‌ లైఫ్‌లోనూ ఆయన పెద్ద ప్రమాదానికి గురయ్యారు. చావుబతుకులతో పోరాడి గెలిచాడు. యాక్సిడెంట్‌ నుంచి కోలుకుని ఇప్పుడు మళ్లీ పూర్వ స్థితికి చేరుకోవడమే కాదు `విరూపాక్ష` అనే ఓ డిఫరెంట్‌ సినిమాతో వస్తున్నారు. తన కెరీర్‌లో మొదటిసారి హర్రర్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్, ఫాంటసీ ఎలిమెంట్లతో కూడిన సినిమా చేశారు. సంయుక్త మీనన్‌ కథానాయికగా నటించగా, కార్తీక్‌ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే అందించిన ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకాలపై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మించారు. నేడు(ఏప్రిల్‌ 21) శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!