బంపర్ ఆఫర్ దక్కించుకున్న డైరెక్టర్ అనుదీప్...విక్టరీ వెంకటేష్ తో నెక్స్ట్ మూవీ...
కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్ .
కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్. 2016లో ‘పిట్టగొడ్డ’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఆ తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రంతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో అనుదీప్ డైరెక్షన్ లో నటించేందుకు బడా స్టార్స్ కూడా ముందుకు వస్తున్నారు. ఇటు ప్రేక్షకులు కూడా కామెడీ ఫిల్మ్స్ పై కాస్తా ఆసక్తి చూపుతుండటంతో అనుదీప్ లాంటి దర్శకులకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.