కనుమరుగైన లవర్ బాయ్స్ కెరీర్ లో చేసిన తప్పు అదేనా..?
ఒకప్పుడు లవర్‌బాయ్‌గా వెలుగొంది, విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్, అబ్బాస్, వినీత్, తరుణ్, తనీష్, అర్జాన్ బజ్జా, వరుణ్ సందేశ్ ఇప్పుడు టాలీవుడ్‌కి దూరమయ్యారు.
ఒకప్పుడు లవర్‌బాయ్‌గా వెలుగొంది, విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్, అబ్బాస్, వినీత్, తరుణ్, తనీష్, అర్జాన్ బజ్జా, వరుణ్ సందేశ్ ఇప్పుడు టాలీవుడ్‌కి దూరమయ్యారు. ఈ లవర్ బాయ్స్ కెరీర్‌లో జరిగిన తప్పేంటి? లవర్‌బాయ్ ఇమేజే వీరి కెరీర్‌ని దెబ్బతీసిందనే టాక్ ఉంది. కమర్షియల్ హీరోగా, మాస్ హీరోగా నిలబడలేకపోవడం కారణంతోపాటు కెరీర్ పరంగా చేసిన తప్పుల కారణంగా వీరంతా సక్సెస్ కాలేకపోయారని చెప్పొచ్చు. సరైన కథల ఎంపిక చేసుకోలేకపోవడం, కాలానుగుణంగా లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడలేకపోవడంతో వీరి సినీ లైఫ్ దెబ్బతిన్నదనే టాక్ వినిపించింది. దీంతోపాటు కొన్ని పర్సనల్ లైఫ్ కారణాలు కూడా ఉన్నాయి. మొత్తానికి వీరంతా ఇప్పుడు టాలీవుడ్ కి కనుమరుగై పోయారని చెప్పొచ్చు.