Asianet News TeluguAsianet News Telugu

చేతులు జోడించి మరీ తనికెళ్ళ భరణి క్షమాపణలు...ఎందుకు..?

ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొద్దిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై భిన్నమైన వాదనలు మొదలైయ్యిన సంగతి తెలిసిందే. 

ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొద్దిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై భిన్నమైన వాదనలు మొదలైయ్యిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి ట్విటర్‌  ద్వారా స్పందించారు.  ఏ మనిషికీ ఇతరుల మనసును నొప్పించే హక్కు  లేదని.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని  తనికెళ్ల భరణి అన్నారు. కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై కొంతమంది నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక వీడియో పంచుకున్నారు.