తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్...
తిరుపతి : తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తిరుపతి : తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రెండ్రోజుల (డిసెంబర్ 12న) క్రితమే పుట్టినరోజు వేడకలు జరుపుకున్న రజనీకాంత్ నిన్న(బుధవారం)కూతురు ఐశ్వర్యతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. టిటిడి అధికారులు రజనీకాంత్ కు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు కల్పించారు. రాత్రి తిరుమలలోనే బసచేసిన రజనీకాంత్ ఇవాళ(గురవారం) ఉదయం వీఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం రజనీకాంత్, ఆయన కూతురికి పండితులు వేదాశీర్వచనం అందించగా టిటిడి అధికారులు ప్రసాదం అందించారు.