హ్యాట్సాఫ్ సోనూసూద్... ఈసారి ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటుకు నడుం బిగించిన రియల్ హీరో
మనిషి తలుచుకుంటే ఏదైనా చేయచ్చు.
మనిషి తలుచుకుంటే ఏదైనా చేయచ్చు.. ఎంతటి కష్టమైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు రియల్ హీరో సోనూసూద్. కరోనా మహమ్మారి నేపథ్యంలో వలసకూలీలను స్వంత ప్రాంతాలకు బస్సుల్లో పంపించడంతో మొదలైన ఆయన సేవాతత్పరత ఇప్పుడు మరో ముందుడుగు వేసింది.