Asianet News TeluguAsianet News Telugu

సలార్ మూవీ డబుల్ బొనాంజా: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండగే..!

 ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.... శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

First Published May 11, 2021, 1:51 PM IST | Last Updated May 11, 2021, 1:55 PM IST

 ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.... శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న 'సలార్'  ఇప్పటికే  ఓ షెడ్యూల్‌ గోదావరి ఖనిలో షూటింగ్ జరుపుకొంది. అయితే సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాపై రోజుకో వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఓ రెండు వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి గనక నిజమైతే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ రెండు న్యూస్ లు ఏమిటి అంటే..