Asianet News TeluguAsianet News Telugu
breaking news image

వైఎస్ జగన్ తో భేటీకి జూ. ఎన్టీఆర్ గైర్హాజర్ వెనక....

తెలుగు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీపై అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.  

తెలుగు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీపై అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.  గురువారం మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, నారాయణమూర్తి వంటి ప్రముఖులతో కలిసి జగన్ తో చిరంజీవి సమావేశమయ్యారు. చిరంజీవితో పాటు మహేష్ బాబు తదితర సినీ ప్రముఖులు హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన విషయం తెలిసిందే.