పుష్ప 2 బడ్జెట్ లో సగానికి పైగా సుకుమార్, బన్నీ జేబుల్లోకే..?
అల్లు అర్జున్-సుకుమార్(Sukuma) కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప భారీ విజయం సాధించింది.
అల్లు అర్జున్-సుకుమార్(Sukuma) కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగిల్చిన ఈ చిత్రం హిందీతో పాటు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి పుష్ప రూ. 360 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్... మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 350 కోట్లకు పెంచేశారు. అలాగే ముందుగా అనుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అయితే పుష్ప 2 చిత్రానికి కేటాయించిన బడ్జెట్ లో అరవై శాతానికి పైగా హీరో, దర్శకుడు రెమ్యూనరేషన్స్ రూపంలోనే పోతుందట.