Asianet News TeluguAsianet News Telugu

PS 1 (పొన్నియిన్ సెల్వన్) పబ్లిక్ టాక్: బాహుబలి లో మిగిలిపోయిన స్క్రాప్ ని తెచ్చి అతికించినట్టుంది సినిమా..!

మణిరత్నం సినిమాలకు మొదటి నుంచి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. 

First Published Sep 30, 2022, 1:01 PM IST | Last Updated Sep 30, 2022, 1:01 PM IST

మణిరత్నం సినిమాలకు మొదటి నుంచి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావటం లేదు. అయితే ఆయనకి చాలా కాలంగా ఓ డ్రీమ్ ఉంది. తమిళంలో బాగా ప్రాచుర్యం పొందిన కల  'కల్కినవలను తెరకెక్కించాలని.  అందుకోసం ఆయన చాలా కష్ట,నష్టాలకు ఓర్చి, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నా పెద్దగా బజ్ లేదు. తమిళంకే పరిమితమైన చరిత్రను తెలుగు వారు చూడటం కష్టమనే భావన చాలా మందిలో ఉంది. అది నిజమేనా...తెలుగువారికి ఈ కథ పడుతుందా...అసలు ఆ కథేంటి..బాహుబలి స్దాయిలో అనుకున్నట్టు వర్కౌట్ అయిందా ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం