Asianet News TeluguAsianet News Telugu

రూమర్స్ కి చెక్...ఎన్ఠీఆర్ ఫాన్స్ కి పండగే...

'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ పిలిచాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. 

First Published Jun 7, 2021, 6:00 PM IST | Last Updated Jun 7, 2021, 6:00 PM IST

'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ పిలిచాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి  'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ అల‌రించారు. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను అన్నారు.   ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఊరించారు. అయితే ఆ కలలన్నిటినీ కరోనా దెబ్బ కొట్టేసింది. దాంతో ఈ షో ను పూర్తి గా ఆపేసారని, ఎన్టీఆర్ డేట్స్ ఎడ్జెస్ట్ అవటం కష్టమని వద్దనుకుంటున్నారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. వాటికి టీవి చానెల్ చెక్ పెట్టాలనుకుంది.  ఇదిలా ఉంటే తాజాగా జెమినీ టీవీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రోమో వదిలింది.