Asianet News TeluguAsianet News Telugu

తలసాని పెద్దమనసు... 14 వేల సినీ కుటుంబాలకు సాయం..

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన ట్రస్టు తరఫున 14వేలమంది సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం అందించబోతున్నారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన ట్రస్టు తరఫున 14వేలమంది సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం అందించబోతున్నారు. గురువారం నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ఇటీవలే సినీ పెద్దలతో ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం 
తెలిసిందేనని కరోనా కారణంగా పూర్తి స్థాయి షూటింగులు మొదలవ్వడానికి సమయం పట్టేలా ఉంది కాబట్టి ఈ ఆలోచన చేశామని మంత్రి తెలిపారు.