నెపోటిజం నిజమే.. మాపై ఆ విమర్శలొచ్చాయ్‌...ఆనంద్‌ దేవరకొండ

అన్న విజయ్‌ దేవరకొండ ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం నాకు సులభమే అయ్యింది. 

First Published Nov 19, 2020, 9:15 PM IST | Last Updated Nov 19, 2020, 9:15 PM IST

అన్న విజయ్‌ దేవరకొండ ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం నాకు సులభమే అయ్యింది. కానీ హీరోగా పేరు 
తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి. అన్న ఇమేజ్‌ నాపై ఉంటుంది. దాన్నుంచి బయటపడి నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా` అని అంటున్నాడు 
హీరో ఆనంద్‌ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ తమ్ముడే ఆనంద్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌`. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌. వినోద్‌ 
దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రేపు(నవంబర్‌ 20న) అమేజాన్‌ ప్రైమ్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హీరోహీరోయిన్‌ ఆనంద్‌ దేవరకొండ, వర్ష 
బొల్లమ్మ, దర్శకుడు వినోద్‌తో ఏషియానెట్‌ న్యూస్‌ తెలుగు ప్రతినిధి అయితగోని రాజు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీరే చూడండి.