Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబుల స్నేహాన్ని చూసి ఈర్ష్య పడుతున్న మంచు లక్ష్మి...?

 

టాలీవుడ్ పెద్దలుగా ఉన్నారు చిరంజీవి, మోహన్ బాబు. 

 

టాలీవుడ్ పెద్దలుగా ఉన్నారు చిరంజీవి, మోహన్ బాబు. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజ నటులు మధ్య స్నేహం చిగురించింది. కొత్తగా స్నేహం చిగురించడం ఏమిటీ.. వాళ్లకు ఎప్పటి నుండో పరిచయం ఉంది కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ కొన్నాళ్ల వరకు చిరంజీవి, మోహన్ బాబు ఉప్పు, నిప్పుగా ఉన్నారు. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకలో వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. చిరంజీవి కి లెజెండరీ నటుడు పురస్కారం ఇచ్చి, మోహన్ బాబుకు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 500 సినిమాలకు పైగా నటించిన నేను ఎవరికంటే తక్కువ కాదని మోహన్ బాబు వేదిక సాక్షిగా ప్రశ్నించారు. 

Video Top Stories