"మా" లో మొదలైన ఎన్నికల హీట్...మెగా ఫ్యామిలీ మద్దతు ఎవరికో తెలుసా..?

`మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌` ఎన్నికల బరిలోకి మంచు మోహన్‌బాబు తనయుడు, మంచు విష్ణు దిగబోతున్నారు. 

First Published Jun 22, 2021, 1:11 PM IST | Last Updated Jun 22, 2021, 1:11 PM IST

`మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌` ఎన్నికల బరిలోకి మంచు మోహన్‌బాబు తనయుడు, మంచు విష్ణు దిగబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సూపర్‌ స్టార్‌ కృష్ణని కలిసి విషెస్‌ తీసుకున్నారు. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారట. పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు.