లాక్‌డౌన్ సేవకులకు పాయసం పంపిణీ.. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి..
రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లో లాక్‌డౌన్ సేవల్లో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది, మీడియా వారికి ఆమె స్వయంగా తయారు చేసిన పాయసాన్ని పంపిణీ చేసారు. ఇదే తనకు నిజమైన పుట్టిన రోజని... ప్రాణాలకు తెగించి..కుటుంబాలను వదిలేసి ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్నవారికి తనవంతుగా నోరు తీపి చేశానని.. అన్నారు.