Asianet News TeluguAsianet News Telugu

రాకీ భాయ్ ని ఈ ఇద్దరు కలిసి డీకొట్టగలరా..?

పాన్ ఇండియా మూవీస్..ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పాన్ ఇండియా మూవీస్ టైం నడుస్తుంది.

First Published Feb 13, 2021, 3:30 PM IST | Last Updated Feb 13, 2021, 3:30 PM IST

పాన్ ఇండియా మూవీస్..ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పాన్ ఇండియా మూవీస్ టైం నడుస్తుంది...ట్రెండ్ ని బాగా ఫాలో అయ్యే తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న మూడు చిత్రాలు పాన్ ఇండియా ఫిలిమ్స్ గా రిలీజ్ కోసం మేకర్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు..దానికి తగ్గట్టుగానే కాస్టింగ్ దగ్గరనుండి కేర్ తీసుకుంటూ ఆ చిత్రాల్లో వేరు వేరు బాషా చిత్రాల నటులు ఉండేలా చూసుకుంటున్నారు..తెలుగు లో రాజమౌళి RRR , సుకుమార్ పుష్ప, పూరి లైగర్ చిత్రాలు పాన్ ఇండియా రిలీజ్ కోసం క్యూ లో ఉన్నాయి..అయితే మిగతా బాషా చిత్ర పరిశ్రమల్లో... ఈ పోటీలో తమిళ ఇండస్ట్రీ  కాస్త వెనకబడి ఉన్నా  కన్నడ నుండి మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ కెజిఫ్ చాప్టర్ 2  ఈ పోటీలో ముందు ఉంది..నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న కెజిఫ్ చిత్రానికి  బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యగల సత్తా ఉన్న చిత్రం గా అంచనాలు ఉన్నాయి..రీసెంట్ గా రిలీజ్ ఐన ట్రైలర్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఉండి ఎక్సపెక్టషన్స్ ని ఆకాశాన్ని  అంటేలా చేసింది.