సమస్యల సుడిగుండంలో రాధే శ్యామ్, మొన్న వైరస్, నిన్న రీషూట్, నేడు వీఎఫ్ఎక్స్..
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నట్లుగానే సినిమాపై బాగా పడిన సంగతి తెలిసిందే.
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నట్లుగానే సినిమాపై బాగా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ లు చాలా భాగం ఆగిపోయాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇలా అర్దాంతరంగా షూటింగ్ లు ఆపటం పెద్ద సమస్యగా మారింది. కానీ తప్పటం లేదు. తాజాగా కరోనా ఎఫెక్ట్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ పై కూడా పడింది. షూటింగ్ ఆగింది. అసలు మొదట నుంచే ఈ చిత్రం షూటింగ్ అనుకున్నట్లుగా జరగలేదు. ఆగి..మొదలై..ఆగి అన్నట్లు సాగింది. సరే మొత్తానికి దాదాపు షూటింగ్ పది రోజులు మినహా పూర్తైంది అన్నారు. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే పడింది.