విలన్ గా రాజశేఖర్ నయా అవతార్... రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

యాంగ్రీ యంగ్‌మేన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్‌ కెరీర్‌ పరంగా టర్న్ తీసుకుంటున్నారు. 

First Published Aug 17, 2021, 2:30 PM IST | Last Updated Aug 17, 2021, 2:30 PM IST

యాంగ్రీ యంగ్‌మేన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్‌ కెరీర్‌ పరంగా టర్న్ తీసుకుంటున్నారు. హీరోగానే కాకుండా విలన్‌గానూ మారబోతున్నాడు. తాజాగా ఆయన గోపీచంద్‌ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో కీలక పాత్ర కోసం రాజశేఖర్‌ని సంప్రదించారట. అయితే పాత్ర నచ్చి తాను నటించేందుకు రాజశేఖర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది.