అన్నదాత ఆలోచన అదుర్స్... ధనమే కాదు పర్యవరణమూ సేఫ్
జగిత్యాల: ఇప్పటి రోజుల్లో బైక్‌లపై తిరగడం సర్వసాధారణం.
జగిత్యాల: ఇప్పటి రోజుల్లో బైక్‌లపై తిరగడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా గుర్రంపై తిరిగితే ప్రత్యేకంగా ఉంటుంది కదా. పెరుగుతున్న పెట్రోలు ధరల బాధను తప్పించుకోవచ్చు. ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు.
జగిత్యాల జిల్లా జాబితాపూర్‌కు చెందిన రవికి జంతువులంటే ప్రేమ. వ్యవసాయం చేస్తూనే... రెండు గుర్రాలు కొనుక్కున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఆర్థిక భారం పెరుగుతోంది. అందుకే రవి ఎటు వెళ్లాలన్నా గుర్రంపైనే వెళ్తుతున్నారు. అశ్వాన్నే వాహనంగా మార్చుకునిపొలం సహా ఇతర పనుల చేసుకుంటున్నారు. మరియు కుటుంబ సమేతంగా వెళ్లడానికి బండి కూడా తయారు చేసుకున్నడు. అందరూ కార్లు, ద్విచక్రవాహనలపై తిరుగుతుంటే.. రవి మాత్రం గుర్రంపై తిరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.