Asianet News TeluguAsianet News Telugu

అవే గన్నులు...అవే ముద్దులు...అదే లవ్ స్టోరీ..కొత్తగా తియ్యండన్నా సినిమాలు...తెలుగు లో హాలీవుడ్ ఏంటి...

అఖిల్ కు మొదటి నుంచి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ.  

First Published Apr 28, 2023, 12:50 PM IST | Last Updated Apr 28, 2023, 12:50 PM IST

అఖిల్ కు మొదటి నుంచి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ.  మొదటి సినిమానే  మాస్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ తో  భారీ బడ్జెట్‌తో ‘అఖిల్‌’అని చేశాడు.అయితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో తన పంథాని మార్చి లవర్‌ బాయ్‌గా మారాడు. అయినా కూడా పెద్ద సెక్సెస్‌ని అందుకోలేకపోయాడు. చివరి మూవీ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ ఊపులో మరోసారి మాస్ హీరో గా తనను తాను చూసుకోవాలని ‘ఏజెంట్‌’గా  మన  ముందుకు వచ్చాడు. అయితే ఈ సారి అయినా అతని మాస్ మంత్రం ఫలించిందా... ‘ఏజెంట్‌’కథేంటి? ఎలా ఉంది? హిట్ అతని ఖాతాలో పడిందా వంటి విషయాలు చూద్దాం.