Asianet News TeluguAsianet News Telugu

రామ్‌చరణ్‌కి సీన్ చెప్పటానికి భయపడ్డ సుకుమార్..కానీ చివరకు...

సుకుమార్‌ ఆలోచనలు పదేళ్ల ముందుంటాయని, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటారని, కాస్త దిగొచ్చి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్‌ అవుతాయని ఓ ప్రెస్‌మీట్‌లో దర్శకధీరుడు రాజమౌళినే స్వయంగా చెప్పాడు. 

సుకుమార్‌ ఆలోచనలు పదేళ్ల ముందుంటాయని, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటారని, కాస్త దిగొచ్చి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్‌ అవుతాయని ఓ ప్రెస్‌మీట్‌లో దర్శకధీరుడు రాజమౌళినే స్వయంగా చెప్పాడు. అలా సుకుమార్‌ దిగొచ్చి చేసిన సినిమానే `రంగస్థలం`. ఆయన చెప్పినట్టుగానే ఇది సంచలన విజయం సాధించింది. రామ్‌చరణ్‌ హీరో, సమంత కథానాయికగా, 1980 నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్‌ సినిమా కథలకు కొత్త దారులు చూపించిన చిత్రమిది. కమర్షియల్‌ చిత్రాల ట్రెండ్‌కి బ్రేకులు వేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ చెవిటి వాడిగా రామ్‌చరణ్‌ అద్భుతమైన నటనని పలికించాడు. 

Video Top Stories