వేణు శ్రీరామ్ అవుట్....బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ తో అనిల్ రావిపూడి రెడీ
వకీల్ సాబ్ విజయం తర్వాత దిల్ రాజు దృష్టి పవన్ తో మరో సినిమా చేయటంపై ఉంది.
వకీల్ సాబ్ విజయం తర్వాత దిల్ రాజు దృష్టి పవన్ తో మరో సినిమా చేయటంపై ఉంది. అలాగే పవన్ సైతం దిల్ రాజు బ్యానర్ లో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారని వినికిడి. ఈ క్రమంలో వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందని అందరూ భావించారు. కానీ దిల్ రాజు ఇప్పుడు తన ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. వకీల్ సాబ్ డైరక్టర్ వేణు శ్రీరామ్ గత 15 ఏళ్లుగా దిల్ రాజు క్యాంప్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు బయిటకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ తో ప్రాజెక్టుని తనకు ఇష్టమైన దర్శకుడు అనీల్ రావిపూడి కు అప్పచెప్పనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.