చిరంజీవి ఆచార్య క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’ . అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్,పాట ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’ . అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్,పాట ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. రామ్‌చరణ్ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది.