Asianet News TeluguAsianet News Telugu

పవన్ అభిమానులకు షాక్... అక్కడ bheemla nayak విడుదల నిలిపివేత

విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.

విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అయితే అన్నిచోట్లా ప్రశాంతంగా ప్రదర్శింపడుతున్న ఈ సినిమా ఏపీలో మాత్రం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్, ఎక్స్ ట్రా షోలకు అనుమతించని జగన్ సర్కార్ టికెట్ల ధరలను కూడా పెంచుకునే అవకాశం కల్పించలేదు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ల ధరలతో సినిమా ప్రదర్శించలేక కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, కంకిపాడులో భీమ్లా నాయక్ విడుదల కాలేదు.  

ఇలా భీమ్లా నాయక్ సినిమా విడుదల నిలిచిపోవడంతో పవన్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ క్రమంలో పవన్ కు అనుకూలంగా, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కి నిరసనకు సిద్దమయ్యారు. దీంతో పరిస్థితి ఉదక్తంగా మారడంతో థియేటర్ వద్ద గుమిగూడిన జనాన్ని, అభిమానుల్ని ఉయ్యూరు పట్టణ పోలీసులు చెదరగొట్టారు. 

Video Top Stories