Asianet News TeluguAsianet News Telugu

గాడ్ ఫాదర్ తో అనసూయ..! పాత్రేంటో తెలుసా..?

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

First Published Aug 24, 2021, 1:59 PM IST | Last Updated Aug 24, 2021, 1:59 PM IST

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏం చేసిన అది సెన్సేషనే. పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు గ్లామర్‌ అద్దిన ఈ యాంకర్ తన అందచందాలతోనే కాకుండా నటనతో సినిమాల్లోనూ బిజీ అవుతోంది. అటు బుల్లితెరను, ఇటు పెద్ద తెరను మ్యానేజ్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా మెగా క్యాంప్ సినిమాల్లో ఆమె ఖచ్చితంగా ఉంటోంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.