Asianet News TeluguAsianet News Telugu

పిచ్చివాడి చేతిలో రాయిలా సాగిన చంద్రబాబు పాలన (వీడియో)

అయిదేళ్ల చంద్రబాబు పాలన పిచ్చివాడి చేతిలో రాయిలా సాగిందని విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా మీట్లో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ విరుచుకుపడ్డారు. విశాఖలో రెండు రోజులున్న చంద్రబాబు తన పార్టీ ఓటమిని సమీక్షించుకోవటం మరచి జగన్ సర్కారును విమర్శించటానికే సరిపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. గత అయిదేళ్ల చంద్రబాబు పాలనే పిచ్చివాడి చేతిలో రాయిలా సాగిందని, కానీ చంద్రబాబు జగన్ పాలనను అలా పోల్చటం హాస్యాస్పదమనీ అన్నారు.

2014 లో అధికారానికి రాగానె ఓటుకు నోటుతో మొదలుపెట్టి జగన్ మీద హత్యా ప్రయత్నం వరకూ అందరికీ తెలిసిందేనన్నారు. ఇపుడు అధికారంతో పాటు కంటి చూపు, మతీ కూడా పోయినట్లుందన్నారు. తాను అసెంబ్లీలో మాటాడితే  వైఎస్ భయపడే వాడనేది కనీసం తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఒప్పుకోరని ఎద్దేవా చేశారు.