Asianet News TeluguAsianet News Telugu

Video: సాయంత్రమే రాయల్ వశిష్ట బోటు బయటకి వచ్చే అవకాశం

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన ప్రదేశంలోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆదివారం కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన ప్రదేశంలోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు. మెరైన్ కెప్టెన్ ఆదినారాయణ సాయంతో వారు ఘటనాస్థలిని పరిశీలించారు. 10 మంది డైవర్స్ నది అడుగు భాగంలోకి వెళ్లి.. బోట్ మునిగిపోయిన ప్రాంతంలో నదీ గర్భం ‘‘V’’ ఆకారంలో ఉందని తెలిపారు.

మరలా పైకి వచ్చి ఐరన్ రోపు తీసుకుని బోట్‌ను బంధించేందుకు నదీ అడుగు భాగానికి వెళ్లారు. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగల లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు సమాచారం.

బోటును మరో ఇరవై మీటర్లు ఒడ్డుకు తీసుకొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చునని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది. అన్ని అనుకూలిస్తే ఆదివారం సాయంత్రమే బోటు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.