Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు పూర్వవైభవం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

బతుకమ్మను నిర్వహించుకోవడం అంటే ప్రకృతిని ఆరాధించడమేనన్నారు తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి నల్లచెరువు కట్ట మీద జరిగిన బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

బతుకమ్మను నిర్వహించుకోవడం అంటే ప్రకృతిని ఆరాధించడమేనన్నారు తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి నల్లచెరువు కట్ట మీద జరిగిన బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో మన సంస్కృతిని ఉద్దేశపూర్వకంగా మరుగునపడేశారన్నారు. ఈ రోజు ఊరూరా, వాడవాడలా, చెరువు గట్ల మీద బతుకమ్మ ఆడని చోటు లేదని మంత్రి తెలిపారు.

ఈ రోజు తెలంగాణ లోనే కాదు లండన్ థేమ్స్ నది ఒడ్డున, దేశ దేశాలలో బతుకమ్మ ఆడుతున్నారని.. ప్రపంచంలోనే మన బతుకమ్మ ప్రత్యేకం, ప్రముఖం అని రుజువుచేస్తున్నామని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక సంస్కృతి తెలంగాణకే సొంతమని.. రాబోయే రోజులలో మరింత ఘనంగా బతుకమ్మను నిర్వహించుకుందామన్నారు. అనంతరం మంత్రి చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మొహంతి,జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.