Video news : కర్నూలులో కదం తొక్కిన న్యాయవాదులు, కలెక్టరేట్ స్తంభన కార్యక్రమం

శ్రీభాగ్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలంటూ కర్నూలు జిల్లాలో న్యాయవాదులు కలెక్టరేట్ స్తంభన కార్యక్రమం నిర్వహించారు.  ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల జేఏసీలతో పాటు అన్ని సంఘాల JACల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాయలసీమలో హైకోర్టుతో పాటు రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే రోజుల తరబడి న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే శనివారం కలెక్టర్ స్తంభన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ గేట్లు మూసివేసి నిరసనకు దిగారు. కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్లే ఉద్యోగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించి సీమకు న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదని న్యాయవాదులు తేల్చి చెప్పారు.

First Published Nov 2, 2019, 1:09 PM IST | Last Updated Nov 2, 2019, 1:09 PM IST