Asianet News TeluguAsianet News Telugu

Video News:శ్రీశైలంలో కార్తీక శోభ: భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం

శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీకమాసంలో మొదటి సోమవారానికి ముందుగానే శ్రీశైలం పురవీధులు కిక్కిరిసిపోయాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకమాసంలో భక్తులు శివపార్వతులను దర్శించుకుంటే కోటిజన్మల పుణ్యం దక్కుతుందనే నమ్మకం తో భారీ ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుతున్నారు

First Published Nov 3, 2019, 4:51 PM IST | Last Updated Nov 3, 2019, 5:00 PM IST

శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీకమాసంలో మొదటి సోమవారానికి ముందుగానే శ్రీశైలం పురవీధులు కిక్కిరిసిపోయాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకమాసంలో భక్తులు శివపార్వతులను దర్శించుకుంటే కోటిజన్మల పుణ్యం దక్కుతుందనే నమ్మకం తో భారీ ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుతున్నారు.

ఇప్పటికే ఆదివారం సెలవు దినం కావడంతో శనివారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకొని వేకువజామునే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగాధర మండపం,నాగుల కట్ట వద్ద కార్తీక దీపాలను కుటుంబ సమేతంగా దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

రేపు కార్తిక మాసం మొదటి సోమవారం కావడంతో  భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారని కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయం ప్రక్కన ఉన్న పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన జరగనుంది