Asianet News TeluguAsianet News Telugu

జీవితాల్లో వెలుగులు నింపే ‘కంటి వెలుగు’ (వీడియో)

అక్టోబర్ 10, వరల్డ్ సైట్ డే సందర్భంగా డా. వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొదట అనంతపురంలో జగన్ ప్రారంభిస్తారని, అదే సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో శాసన సభ్యులు ప్రారంభిస్తారని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిణి డా. యాస్మిన్  పేర్కొన్నారు.

డా. వై.యస్.ఆర్ కంటి వెలుగు పధకంపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య  శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్లో యాస్మిన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  పాత్రికేయులతో మాట్లాడుతూ, అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి వెలుగు పధకాన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు.  మొదటి దశ ఈ నెల 10 వ తేది నుండి 16 వ తేది వరకు, రెండవ దశ  నవంబర్ 1 నుండి డిశంబర్ 31 వరకు జరుగుతుందని యాస్మిన్ తెలిపారు. తల్లి తండ్రులు స్కూళ్ళలో ఆటంకం కల్గించకుండా, పిల్లలందరూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకునే విధంగా సహకరించి, కంటి వెలుగు  కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.