Asianet News TeluguAsianet News Telugu

మూసీ నదికి స్టాఫ్ లాగ్ గేట్‌ను అమర్చిన అధికారులు (వీడియో)

మూసీ నదిపై మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్షలో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మూసీ గేట్ తొలగడంతో ఆయన వరుసపెట్టి సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాఫ్ లాగ్ గేట్ల అంశం అధికారులు గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది

మూసీ నదిపై మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్షలో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మూసీ గేట్ తొలగడంతో ఆయన వరుసపెట్టి సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాఫ్ లాగ్ గేట్ల అంశం అధికారులు గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఐదు స్టాఫ్ లాగ్ గేట్లను చిత్తూరు జిల్లాలోని కళ్యాణి డ్యామ్‌కు వినియోగించగా.. మిగిలిన దానిని సూర్యాపేట జిల్లాలోని మూసీ రిజర్వాయర్ వద్దకు తరలించారు. దీంతో యుద్ధప్రాతిపదికన మరో ఎనిమిది గేట్ల తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

వాటిని సైతం రెండు రోజుల్లో మార్చాలని జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు రిజర్వాయర్‌లో నీటిమట్టం 625 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1200 కాగా.. అవుట్ ఫ్లో 8000గా ఉంది.