Asianet News TeluguAsianet News Telugu

దేవరగుట్ట కర్రల సమరానికి సర్వం సిద్దం... (వీడియో)

విజయ దశమి(దసరా) పండగను తెలుగు ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడో సెటిలైనవారంతా తమ సొంత ఊళ్లకు చేరుకుని సంతోషంగా గడుపుదామని అనుకుంటారు. కానీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో మాత్రం ఇలా జరగదు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చేవారు కర్రలను చేతబూని దాడులకు సిద్దపడతారు. ప్రతి దసరాకు ఈ కర్రల యుద్దం  జరుగుతూనే జరుగుతూనే  వుంటుంది. 

కర్నాటక సరిహద్దులోని దేవరగట్టు కొండపై వెలసిన మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో దసరా రోజు భక్తుల నడుమ జరిగే భీకర కర్రల సమరం జరుగుతుంది.    అర్ధరాత్రి నుండి తెల్లవారే వరకు చీకట్లో కర్రలు.. దివిటీలతో గుంపులు గుంపులుగా తలలు పగిలే రీతిలో  ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు.  ఇలా ఈసారి కూడా దసరా రోజున కర్రల సమరానికి సర్వం సిద్దమవుతోంది. ఈ  సాంప్రదాయబద్ద కర్రల సమరాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పొరుగునే వున్న కర్నాటక ప్రజలు సైతం ఎంతో  ఆసక్తితో..  ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

Video Top Stories