Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో ప్రభుత్వం, పాలన రెండూ గందరగోళమే...: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ ఒక్క నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని విమర్శనాస్త్రాలు సంధించారు. కర్నూల్ జిల్లా డోన్ లో పర్యటించిన ఆయన ప్రభుత్వంపై నిప్పులు  చెరిగారు.    

ఉద్యోగ భద్రత వుంటే అమరావతిలో ఉద్యోగస్తులు ఎందుకు ధర్నాలు చేస్తారని ప్రశ్నించారు. రాజధానిని అమరావతి నుండి దోనకొండకు మారుస్తారన్న ప్రచారంతో  గందరగోళం మొదలయ్యింది. దీంతో కర్నూలును రాజధానిగా ప్రకటించాలని...కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని  ధర్నాలు మొదలయ్యాయని అన్నారు. 

ఇక ఇసుక పై కొత్త  నిర్ణయం వల్ల భవన కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఇసుక కృత్రిమ కొరత ఏర్పడింది. అందువల్ల ఆర్థిక మంత్రి బుగ్గన నియోజకవర్గంలోనే వైస్సార్సీపీ నాయకుల ఇసుక మాఫియా ఇంత భారీఎత్తున రాజ్యమేలుతుంటే మిగతా చోట ఏవిధంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తం మీద రాష్టంలో జగన్ ప్రభుత్వం గందరగోళ ప్రభుత్వంగా మారింది. రాజధానిపైన,హై కోర్ట్ పైన, ఏ ఒక్క నిర్ణయం పైన స్పష్టత లేదు. అలాగే నదుల అనుసంధానం పైన తెలంగాణ వాళ్ళు తమ నిర్ణయాలు చెబుతున్నారు. కాని జగన్ చెప్పడం లేదని అన్నారు. అంటే తెలంగాణా కు, ఆంద్రాకు కేసీఆర్ యే ముఖ్యమంత్రా అని ఆయన ప్రశ్నించారు. 
 
ఇప్పటికైనా రాష్ట్ర సమస్యల పైన జగన్ తక్షణమే స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటిపై చర్చించాలని ,అలాగే సచివాలయం పేపర్ లీక్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేసారు.