Asianet News TeluguAsianet News Telugu

నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా (వీడియో)

ప్రకాశం జిల్లా, మార్కాపురం కంభంపాడుకు చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెడితే తాడేపల్లికి చెందిన ఓవ్యక్తి నేవీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనుదీప్ రెడ్డి, సాంబిరెడ్డి అనేవ్యక్తుల నుండి 82 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరొక వ్యక్తి దగ్గర ఒరినల్ సర్టిఫికెట్లు తీసుకున్నాడు.

అయితే ఇది జరిగిన ఆరునెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించలేదు. ఏమయిందని అడిగితే సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు తాడేపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ విషయం తెలిసిన నిందితుడు గొంతుకోసుకుని హాస్పిటల్లో చేరాడు. నిందితుడి నుండి 60 లక్షల రూపాయల రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో అటు బాధితులు మీడియా ముందుకు రాకపోవడం, పోలీసులు కూడా వివరాలు తెలిపేందుకు సుముఖంగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.