Asianet News TeluguAsianet News Telugu

రెండు రోజుల క్రితమే ప్రేమపెళ్లి: పుట్టింటికొచ్చి శవమై తేలిన యువతి (వీడియో)

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రెడ్ల పల్లి గ్రామంలో "బిసి" కులానికి చెందిన చందన వడ్డుమడి గ్రామానికి చెందిన నందకుమార్ లు ప్రేమించుకున్నారు. రెండు రోజుల క్రితం ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళి  నచ్చని అమ్మాయి కుటుంబం వారు గొడవకు దిగారు. చివరికి గ్రామ పెద్దల ద్వారా అమ్మాయిని ఇంటికి పిలిపించారు. శనివారం రాత్రి పుట్టింటికి వచ్చిన చందన తెల్లారకముందే శవమైంది.

చందనన తల్లిదండ్రులు రాత్రికి రాత్రి ఆమెను హత్య చేసి దహనం చేసేశారని అబ్బాయి తరఫువారు ఆరోపిస్తున్నారు.  చందన ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అమ్మాయి తల్లిదండ్రులు చెబుతున్నారు. శాంతిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ముమ్మాటికీ పరువు మాటున జరిగిన దురహంకార హత్యేనని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Video Top Stories