Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ కు చేరుకున్న టీమిండియా క్రికెటర్లు... విమానాశ్రయంలో అభిమానుల కోలాహలం

హైదరాబాద్ :  టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య స్వదేశంలో జరుగుతున్న టీ20 సీరిస్ లో చివరి మ్యాచ్ కు హైదరాబాద్ వేదిక కానుంది.

First Published Sep 25, 2022, 10:09 AM IST | Last Updated Sep 25, 2022, 10:09 AM IST

హైదరాబాద్ :  టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య స్వదేశంలో జరుగుతున్న టీ20 సీరిస్ లో చివరి మ్యాచ్ కు హైదరాబాద్ వేదిక కానుంది. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ భారత్-ఆసిస్ తలపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ కు చేరకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి ఆటగాళ్లు చేరుకున్న సందర్భంలో వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో విమానాశ్రయం సందడిగా మారింది. 

ఇక ఇప్పటికే మూడు మ్యాచ్ ల టీ20 సీరిస్ లో భారత్, ఆసిస్ 1-1 తో సమంగా నిలిచారు. దీంతో హైదరాబాద్ లో నేడు జరిగే మ్యాచ్ సీరిస్ విజయాన్ని నిర్ణయించనుంది. ఇది కూడా హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.