Asianet News TeluguAsianet News Telugu

రెచ్చగొడితే అంతు తేల్చేదాకా వదలం.. టీమిండియా నయా మంత్ర

మైదానంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కోహ్లిసేనను రెచ్చగొట్టగా.. స్టాండ్స్‌లో ఇంగ్లీష్‌ అభిమానులు రెండు అడుగులు ముందుకేశారు. భారత ఆటగాళ్లను ఎగతాళి వేస్తూ, వెకిలి చేష్టలతో అవమాన పరిచే దుస్సహానికి పాల్పడ్డారు. గ్రౌండ్‌లోకి బాటిల్‌ మూతలు సైతం విసిరారు!... లార్డ్స్‌లో అటు ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, ఇటు ఇంగ్లాండ్‌ అభిమానులు కవ్వింపు చర్యలతో హద్దుమీరినా.. కోహ్లిసేన ఆ కసిని ఆటలోనే చూపించింది. చారిత్రక లార్డ్స్‌లో మరుపురాని విజయం అందుకుంది. తమపై విసిరిన రాళ్లనే మైలురాళ్లుగా చేసుకుని లార్డ్స్‌ కోటను హస్తగతం చేసుకున్నారు.

First Published Aug 18, 2021, 12:56 PM IST | Last Updated Aug 18, 2021, 12:56 PM IST