రిషబ్ పంత్... సెంచరీ మిస్ అయినా చరిత్రలో నిలిచేపోయే ఇన్నింగ్స్...
గాయంతోనే బరిలో దిగి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించిన రిషబ్ పంత్...
గాయంతోనే బరిలో దిగి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించిన రిషబ్ పంత్... సెంచరీ ముంగిట పెవిలియన్ చేరాడు. 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కి పంత్, పూజారా కలిసి జోడించిన భాగస్వామ్యం 148 పరుగుల వద్ద ముగిసింది. 250 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి.