రహానే మార్కు కెప్టెన్సీ: నటరాజన్ బదులు సైనీకి అవకాశం.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాను కోహ్లీ లేని వేళ గెలుపుబాట పట్టించి ఔరా అనిపించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాను కోహ్లీ లేని వేళ గెలుపుబాట పట్టించి ఔరా అనిపించాడు. కెప్టెన్ గా రహానే తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అది ఏ ఈ ఒక్క టెస్టుకో పరిమితమవ్వలేదు. 2017లో ధర్మశాల టెస్టు నుంచి కూడా రహానే ఇదే స్టైల్ లో కొనసాగుతూ తన మార్కును చూపెడుతూనే ఉన్నాడు. మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టులోనూ రహానె తుది జట్టును తనదైన శైలిలో ఎంచుకున్నాడు. సిడ్నీ టెస్టుకు తుది జట్టులో రహానె రెండు మార్పులు చేశాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం టాప్ ఆర్డర్‌లో ఓ బ్యాట్స్‌మన్‌పై వేటు వేయటం.... గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో మూడో పేసర్‌ను ఎన్నుకోవటం రహానె ముందున్న సవాళ్లు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు వేసిన రహానె.. రోహిత్ శర్మకు మార్గం సుగమం చేయగా.... ఇక మూడో పేసర్ రేసులో నవదీప్ సైనిని ఎంచుకున్నాడు. నెట్ బౌలర్ నుంచి టెస్టు జట్టులోకి ఎంపికైన తంగరసు నటరాజన్‌కు ఆరంగేట్ర అవకాశం దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ అజింక్య రహానె సైనిని తుది జట్టులోకి తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.