టీమిండియాకు లక్కీ చార్మ్ గా మారిన నట్టు: మ్యాచ్ ఆడితే భారత్ గెలుపు గ్యారంటీ
అదృష్టం కలిసొస్తే ఎలా ఉంటుందో... అచ్చం అది టి. నటరాజన్(నట్టూ)లా ఉంటుంది.
అదృష్టం కలిసొస్తే ఎలా ఉంటుందో... అచ్చం అది టి. నటరాజన్(నట్టూ)లా ఉంటుంది. కేవలం సహచరులకు నెట్‌లో సహకారం అందించేందుకు నెట్ బౌలర్‌గా వచ్చి ఏకంగా అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసి కీలక బౌలర్‌గా మారడం నిజంగా అదృష్టమే. అయితే అందులో నట్టూ శ్రమ కూడా ఎంతో ఉంది. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి రాణించిన తమిళనాడుకు చెందిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ నట్టూ ఆస్ట్రేలియాలో జరుగుతున్న పర్యటనలో నెట్ బౌలర్‌గా వెళ్లాడు.