క్రికెట్ ప్రపంచంపై రారాజు మహేంద్రుడి చెరగని ముద్రలివే

నరాలు తెగే ఉత్కంఠతో కూడిన క్రికెట్‌లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమెలాగో నేర్పాడు. 

First Published Aug 17, 2020, 7:48 PM IST | Last Updated Aug 17, 2020, 7:48 PM IST

నరాలు తెగే ఉత్కంఠతో కూడిన క్రికెట్‌లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమెలాగో నేర్పాడు. ఒత్తిడితో కూడుకున్న ఛేదనలను నేర్పుగా ముగించటమెలాగో చూపించాడు. అంతఃప్రేరణతో అనూహ్య నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపించాడు. కూల్‌గా ప్రపంచకప్‌లు సాధించే మార్గం చూపాడు. ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని శకం ముగిసింది. శనివారం రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు మహి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రకటించాడు. 2014లో టెస్టులకు గుడ్‌బై చెప్పినట్టే, ఐపీఎల్‌ 2020 కోసం చెన్నైకి చేరుకున్న ధోని కూల్‌గా తనదైన శైలిలో కెరీర్‌కు ముగింపు పలికాడు.ఈ ముగింపు ఎందరో అభిమానులకు గుండెకోతను మిగిల్చింది.