INDvsAUS: అజింకా రహానే అద్భుత సెంచరీ... సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టిన కెప్టెన్...
మొదటి టెస్టులో విరాట్ కోహ్లీని రనౌట్ చేసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అజింకా రహానే...
మొదటి టెస్టులో విరాట్ కోహ్లీని రనౌట్ చేసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అజింకా రహానే... బాక్సింగ్ డే టెస్టులో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాకు వరుసగా 4, 5, 6వ వికెట్లకు 50+ భాగస్వామ్యాలు నెలకొల్పి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు రహానే. భారత జట్టుకి మంచి ఆధిక్యాన్ని అందిస్తూ, బాక్సింగ్ డే టెస్టులో పట్టు సాధించే దిశగా తీసుకెళ్తున్నాడు తాత్కాలిక కెప్టెన్ రహానే. రెండో రోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి 91.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది టీమిండియా. అజింకా రహానే 104 పరుగులతో రవీంద్ర జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 82 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత జట్టు.