Asianet News TeluguAsianet News Telugu

ఒకే దెబ్బకు అందరి నోర్లు మూయించిన రిషబ్ పంత్

యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై ఇండియాకు చారిత్రాత్మక విజయం అందించాడు. 

First Published Jan 20, 2021, 12:52 PM IST | Last Updated Jan 20, 2021, 12:52 PM IST

యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై ఇండియాకు చారిత్రాత్మక విజయం అందించాడు. 138 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్ కు అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో మ్యాచు మాత్రమే కాకుండా సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత రిషబ్ పంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన ప్రదర్శన ద్వారా విమర్శకుల నోళ్లు మూయించిన పంత్ తన జీవితంలో ఇది అత్యంత భారీ సంఘటన అని అన్నాడు. తాను మైదానంలోకి దిగనప్పుడు కూడా తన పక్కన నిలబడిన జట్టు సహచరులకు, సపోర్ట్ స్టాఫ్ కు అతను ధన్యవాదాలు తెలిపాడు.