తొలి టి20లో భారత్ సూపర్ విక్టరీ: వర్కౌట్ అయిన 11+1 ఫార్ములా
INDvAUS 1st T20I: ఆఖరి వన్డేలో దక్కిన ఓదార్పు విజయం టీమిండియాకి రెట్టింపు బూస్ట్ ఇచ్చినట్టు ఉంది.
INDvAUS 1st T20I: ఆఖరి వన్డేలో దక్కిన ఓదార్పు విజయం టీమిండియాకి రెట్టింపు బూస్ట్ ఇచ్చినట్టు ఉంది. బ్యాటింగ్‌లో కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తప్ప అందరూ ఫెయిల్ అయినా, బౌలింగ్‌లో మాత్రం టీమిండియా అదరగొట్టింది. మొట్టమొదటి టీ20 ఆడుతున్న నటరాజన్‌తో పాటు జడ్డూ ప్లేస్‌లో 12వ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్ చెలరేగి ఆసీస్‌ను కుప్పకూల్చారు.