Video news : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ స్థానం పదిలం
భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ జాబితాలో 360 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ మీద 2-0 సిరీస్ విజయంతో భారత్ 360 పాయింట్లకు చేరుకుంది.
భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ జాబితాలో 360 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ మీద 2-0 సిరీస్ విజయంతో భారత్ 360 పాయింట్లకు చేరుకుంది. తొమ్మిది జట్ల ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇంకా ఒక పాయింట్ కూడా పడలేదు. వెస్టిండీస్ తో 2-0 విజయాన్ని అందుకుంది. కోలకతాలోని ఈడెన్ గార్డెన్స్ లో వెస్టీండీస్ తో జరుగుతున్న 3-0సిరీస్ లో మొదటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది.
ప్రతీ సిరీస్ కి 120 పాయింట్లుంటాయి. ఆ సిరీస్ లో ఉండే మ్యాచులను బట్టి పాయింట్లు సమానంగా విభజిస్తారు. రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ అయితే ప్రతీ మ్యాచ్ కు 60 పాయింట్లు ఇస్తారు. అదే ఐదు మ్యాచుల సిరీస్ అయితే ప్రతీ మ్యాచుకు 24 పాయింట్లు వస్తాయి.
పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియా 116 పాయింట్లు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో చెరి రెండు మ్యాచులు గెలిచి, చెరీ 56 పాయింట్లు సాధించాయి. ఈ మ్యాచ్ 2-2 తో డ్రా అయ్యింది.
శ్రీలంక, న్యూజిలాండ్ రెండు మ్యాచ్ ల సిరీస్ లో చెరొకటి గెలిచి, చెరో 60 పాయింట్లు సాధించాయి. పాకిస్తాన్ మొదటిసారిగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడుతోంది. ఇక బంగ్లాదేశ్, వెస్టీండీస్, దక్షిణాఫ్రికా ఇప్పటికింకా ఖాతాలు తెరవలేదు. ఈ సిరీస్ లో ఫైనల్ కి చేరుకున్న జట్లు 2021 జూన్ లో UKలో జరిగే ఫైనల్ లో తలబడతాయి. గెలిచిన టీం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంటుంది