32ఏండ్ల ఆస్ట్రేలియా రికార్డును బద్దలుగొట్టి టెస్టు సిరీసును కైవసం చేసుకున్న భారత్

గత 30 ఏళ్లలో ఆస్ట్రేలియాకి ఓటమి లేని స్టేడియం...

First Published Jan 19, 2021, 3:48 PM IST | Last Updated Jan 19, 2021, 3:48 PM IST

గత 30 ఏళ్లలో ఆస్ట్రేలియాకి ఓటమి లేని స్టేడియం... ‘గబ్బా’లో ఆడాలంటే ఏ జట్టైనా భయపడేంత దుర్భేధమైన పిచ్. ‘బ్రిస్బేన్’లో విజయం మాదేనని పూర్తి ధీమాగా ఉన్న ఆస్ట్రేలియా... ఏ మాత్రం అనుభవం లేని టీమిండియా బౌలింగ్... అలాంటి క్లిష్ట పరిస్థఇతులను దాటుకుని రహానే నాయకత్వంలోని టీమిండియా చరిత్ర క్రియేట్ చేసింది. గబ్బాలో ఓటమి లేకుండా 32 టెస్టుల పాటు సాగిన ఆస్ట్రేలియా ఆధిపత్యానికి చెక్ పెడుతూ అద్వితీయ విజయం సాధించింది టీమిండియా. భారత యంగ్ వికెట్ కీపర్ పరుగులతో రాణించగా వాషింగ్టన్ సుందర్, ఛతేశ్వర్ పూజారా, శుబ్‌మన్ గిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది భారత జట్టు. విరాట్ కోహ్లీ లేకుండా ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు లేకుండా రిజర్వు బెంచ్ ప్లేయర్లతో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది భారత జట్టు.