బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి హార్ట్ ఎటాక్: సాయంత్రం ఆపరేషన్
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురయ్యారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. వెంటనే ఆయనను కుటంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం కూడా తెలియడం లేదు. సాయంత్రానికి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాగా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గంగూలీ అభిమానులంతా ఆయన కోలుకోవాలంటూ ట్విట్టర్ లో మెసేజులు పెడుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.