పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడు... పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పై ప్రియురాలు ఫిర్యాదు
ఐసీసీ (ICC)టోర్నీలలో భారత్ (India) ను ఓడించలేరనే అపవాదును తొలగించుకుంటూ ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ (Pakistan) చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఐసీసీ (ICC)టోర్నీలలో భారత్ (India) ను ఓడించలేరనే అపవాదును తొలగించుకుంటూ ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ (Pakistan) చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా లెజెండరీ కెప్టెన్లకు సైతం సాధ్యం కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పాక్ కెప్టెన్ (Pakistan captain) బాబర్ ఆజమ్ (babar Azam).. ఈ గెలుపుతో అక్కడ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అతడి కీర్తిని పాక్ పత్రికలు ఆహా.. ఓహో అంటూ రాస్తున్నాయి. కానీ అతడు కనిపించే మంచోడు కాదని అంటున్నది అతడి మాజీ ప్రేయసి (Babar Azam Girlfriend). ఆజమ్ పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.